Supreme Court: గవర్నర్ నిర్ణయాన్ని తెలిపేముందు అసలేం జరిగిందో కోర్టుకు వివరిస్తాను: సొలిసిటర్ జనరల్

  • ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అన్ని పార్టీలను ఆహ్వానించారు
  • అన్ని పార్టీలు విఫలమైన తర్వాతే రాష్ట్రపతి పాలన విధించారు
  • దీనిపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం గవర్నర్ కు లేదు

మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ వెంటనే బలపరీక్ష ఎదుర్కొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాల మేరకు సొలిసిటర్ జనరల్ కోర్టుకు పలు వివరాలు వివరిస్తున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని తెలిపేముందు అసలేం జరిగిందో కోర్టుకు వివరిస్తానని  చెప్పారు.

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అన్ని పార్టీలను ఆహ్వానించారని, పార్టీలన్నీ విఫలమైన తర్వాతే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారని సొలిసిటర్ జనరల్  వివరించారు. దీనిపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం గవర్నర్ కు లేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ కు మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ ఇచ్చిన ఒరిజినల్ లేఖను సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ సమర్పించారు.

More Telugu News