అయోధ్యకు రాముడొస్తున్నాడు: కన్నా

24-11-2019 Sun 14:27
  • అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పు
  • వివాదాస్పద భూమి హిందువులదేనన్న సుప్రీం
  • మోదీపై కన్నా ప్రశంసలు

బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, అయోధ్యకు రాముడొస్తున్నాడని వ్యాఖ్యానించారు. అయోధ్య భూవివాదంపై ఇటీవల సుప్రీం కోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని ఆయన స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ కారణంగానే ఇది సాధ్యమైందని తెలిపారు. మోదీ హయాంలో వారణాసి పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా మరింతగా విరాజిల్లుతోందని, గంగానది స్వచ్ఛతను సంతరించుకుంటోందని కీర్తించారు.

అటు, బీజేపీ ఇన్ చార్జి సునీల్ దేవధర్ మాట్లాడుతూ, ఏపీ సర్కారు హిందూ మత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నాయని విమర్శించారు.