Rangamarthanda: 'రంగమార్తాండ' చిత్రంలో బ్రహ్మానందం లుక్ చూశారా... మనసులు కదిలించే పాత్ర అంటున్న కృష్ణవంశీ!

  • మరాఠీ చిత్రానికి రీమేక్ గా రంగమార్తాండ
  • ప్రధానపాత్రల్లో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ
  • కీలకపాత్రలో బ్రహ్మానందం

మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ అనే చిత్రాన్ని తెలుగులో రంగమార్తాండ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధానపాత్రధారులు. ఇందులో నవ్వుల రేడు బ్రహ్మానందం ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.

సాధారణంగా బ్రహ్మీ ఉన్నాడంటే అందులో నవ్వులకు కొదవ ఉండదు. కానీ రంగమార్తాండ చిత్రంలో ఆయన పాత్ర మనసులు కదిలించే విధంగా ఉంటుందని దర్శకుడు కృష్ణవంశీ చెబుతున్నాడు. నటన నుంచి తప్పుకున్న ఓ నాటకరంగ నటుడి విషాదకర జీవితమే రంగమార్తాండ స్టోరీ. ఇందులో బ్రహ్మానందం పాత్ర కూడా అలాంటిదే! తాజాగా విడుదలైన ఆయన లుక్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది.

More Telugu News