subramanian swamy: శశికళ జైలు నుంచి వస్తే అన్నాడీఎంకే నేతలంతా ఆమె వైపే: సుబ్రహ్మణ్యస్వామి

  • అన్నాడీఎంకేను ఆమె సమర్థంగా నిర్వహించగలరు
  • మరో ఏడాదిన్నరలో ఆమె బయటకు వస్తారు
  • సినిమా గారడీ వాళ్ల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ కనుక బయటకు వస్తే అన్నాడీఎంకే నేతలంతా ఆమె వద్దకు క్యూకడతారని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఆమెలో మంచి ప్రతిభ ఉందని ప్రశంసించిన స్వామి, పార్టీని ఆమె సమర్థంగా నిర్వహించగలరని కొనియాడారు. మరో ఏడాదిన్నరలో ఆమె జైలు నుంచి బయటకు వస్తారని, అప్పుడు అన్నాడీఎంకే ముఖ్య నేతలంతా ఆమె వద్దకు క్యూ కడతారని అన్నారు.

కమలహాసన్, రజనీకాంత్‌లపైనా సుబ్రహ్మణ్యస్వామి విరుచుకుపడ్డారు. వారిద్దరూ కలిసినంత మాత్రాన తమిళనాడుకు ఒరిగేదేమీ ఉండదన్నారు. త్వరలో విడుదల కాబోతున్న తమ సినిమాల పబ్లిసిటీ కోసమే వారిద్దరూ విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సినిమా గారడీ వాళ్లు రాష్ట్రానికి చేసిందేమీ లేదని సుబ్రహ్మణ్యస్వామి ఎద్దేవా చేశారు.  

More Telugu News