Maharashtra: మహారాష్ట్రలో బీజేపీ బలపరీక్షపై నేడు సుప్రీం అత్యవసర విచారణ

  • కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పిటిషన్ విచారణకు సుప్రీం ఓకే
  • నేటి ఉదయం 11:30 గంటలకు విచారణ
  • ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలన్న మూడు పార్టీలు

మహారాష్ట్రలో బీజేపీ ఆగమేఘాల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, బలపరీక్షకు గవర్నర్ వారం రోజులు గడువు ఇవ్వడంపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మండిపడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవిస్‌ను గవర్నర్ ఆహ్వానించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. తమకు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాయి. అంతేకాదు, ఫడ్నవిస్ ప్రభుత్వం నేడు బలపరీక్ష నిర్వహించేలా చూడాలని కోరాయి. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని మూడు పార్టీలు అభ్యర్థించాయి. అంగీకరించిన సుప్రీంకోర్టు నేటి ఉదయం 11:30లకు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.

కాగా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండగానే నిన్న ఉదయం బీజేపీ షాకిచ్చింది. ఉదయం ఎనిమిది గంటలలోపే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. తమకు మద్దతు ఇచ్చిన అజిత్ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమైంది.

More Telugu News