Car: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుంచి కారు ఎలా పడిపోయిందో ఈ వీడియోలో చూడండి!

  • హైదరాబాద్ లో ఘోర ప్రమాదం
  • ఫ్లైఓవర్ నుంచి కిందపడిపోయిన కారు
  • ఓ వ్యక్తి మృతి

హైదరాబాదులో ఈ మధ్యాహ్నం ఒళ్లు గగుర్పొడిచే రీతిలో కారు ప్రమాదం జరిగింది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై అమితవేగంతో దూసుకొచ్చిన ఓ ఎరుపురంగు ఫోక్స్ వ్యాగన్ కారు ఫ్లైఓవర్ నుంచి కిందపడిపోయింది. దాంతో రోడ్డుపై వెళుతున్న ఓ మహిళ దుర్మరణం పాలైంది. ఈ ఘటనలో మరో రెండు కార్లు దెబ్బతినగా, దాదాపు 9 మంది వరకు గాయాలపాలైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మలుపు వద్ద కూడా కారు వేగం తగ్గకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు వీడియో ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది.

More Telugu News