India: మళ్లీ ఇషాంతే... రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్

  • హడలెత్తిస్తున్న ఇషాంత్
  • ఇద్దర్ని డకౌట్ చేసిన పొడగరి పేసర్
  • రెండో ఇన్నింగ్స్ లోనూ బంగ్లాను వీడని కష్టాలు

కోల్ కతా టెస్టులో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మకు ఎదురులేకుండా పోతోంది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ ను అతలాకుతలం చేసిన ఈ పొడగరి రెండో ఇన్నింగ్స్ లోనూ అదే జోరు చూపిస్తున్నాడు. 241 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా జట్టును ఇషాంత్ ఆరంభంలోనే దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో చెలరేగిన ఇషాంత్ ను అర్థం చేసుకోవడంలో బంగ్లా బ్యాట్స్ మెన్ మరోసారి తడబడ్డారు. దాని ఫలితమే రెండు పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి. ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్ డకౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ మొమినుల్ హక్ సైతం అదే రీతిలో నిష్క్రమించాడు. ఈ రెండు వికెట్లు ఇషాంత్ ఖాతాలోకే చేరాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 7 పరుగులు కాగా, ఓపెనర్ ఇమ్రుల్ కయేస్ (3), మహ్మద్ మిథున్ (4) ఆడుతున్నారు.

More Telugu News