Samamtha: ప్రతి రోజూ నీ సుఖసంతోషాల కోసమే నా ప్రార్థన: సమంత

  • చైతూకు బర్త్ డే విషెస్ తెలిపిన సమంత
  • భావోద్వేగాలతో స్పందన
  • ఐ లవ్యూ డార్లింగ్ హజ్బెండ్ అంటూ ట్వీట్

టాలీవుడ్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంతల మధ్య అనుబంధం ఎంత పటిష్టమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లాంగ్ టైమ్ లవర్స్ పెళ్లితో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ప్రత్యేక సందర్భాల్లో ఒకరి కోసం ఒకరు స్పందించే తీరు ఈ జోడీ ప్రత్యేకతను చాటుతుంది. తాజాగా నాగచైతన్య బర్త్ డే సందర్భంగా సమంత చేసిన ట్వీట్ హార్ట్ టచింగ్ గా ఉంది.

"నా నాగచైతన్యకు హ్యాపీ బర్త్ డే. ప్రతిరోజూ నేను ప్రార్థించేది నీ సుఖసంతోషాల కోసమే. ఓ వ్యక్తిగా నువ్వు ప్రతిరోజూ ఎదుగుతుండడం పట్ల నేనెంతో గర్విస్తున్నాను. మన మధ్య బంధం విడదీయరానిదిగా మారుతోందని నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐ లవ్యూ డార్లింగ్ హజ్బెండ్" అంటూ సామ్ ట్వీట్ చేసింది.

More Telugu News