NCP: అజిత్ పవార్ పై వేటు.. పార్టీ నుంచి బహిష్కరించిన ఎన్సీపీ

  • బీజేపీకి మద్దతు ఇవ్వడం అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయం
  • అజిత్ నీతిమాలిన చర్యకు పాల్పడ్డారు
  • మాకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతుందన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

మహారాష్ట్రలో ఎన్సీపీ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించిన అజిత్ పవార్ పై వేటు పడింది. అజిత్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. బీజేపీకి మద్దతు ఇవ్వడం అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతుందని శరద్ పవార్ ప్రకటించారు. కొంత మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని ఆయన చెప్పారు. అజిత్ నీతిమాలిన చర్యకు పాల్పడ్డారన్నారు. ఆయన నిర్ణయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సాయంత్రం 4.30 గంటలకు శరద్ పవార్ తన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలను లెక్కించి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్లు  సమాచారం.

More Telugu News