Jayalalitha: జయలలిత బయోపిక్ 'తలైవి' నుంచి కంగన రనౌత్ ఫస్ట్ లుక్ ఇదిగో!

  • జయలలితగా కంగన రనౌత్
  • విజయ్ దర్శకత్వంలో బయోపిక్
  • వచ్చే ఏడాది జూన్ 26న రిలీజ్ కానున్న 'తలైవి'

పురచ్చితలైవి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి'. ఈ బయోపిక్ లో బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగన రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో  కంగన జయలలిత రూపంలో విక్టరీ సింబల్ చూపిస్తోంది. కాగా, ఈ రియల్ లైఫ్ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయలలిత జీవితంలో నాటకీయ పరిణామాలకు కొదవలేకపోవడంతో సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఇప్పటినుంచే టాక్ వినిపిస్తోంది.

More Telugu News