Ajit Pawar: మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ ఉన్న రెండో నేతగా అజిత్ పవార్.. థాకరేకు అందనంత ఎత్తులో ఎన్సీపీ రెబల్!

  • ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మళ్లీ విడుదల చేసిన వీడీఏ అసోసియేట్స్
  • 6వ స్థానంలో ఉద్ధవ్ థాకరే
  • 3వ స్థానంలో ప్రకాశ్ అంబేద్కర్

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న నేత అజిత్ పవార్ అని వీడీఏ అసోసియేట్స్ తెలిపింది. 2019 మహారాష్ట్ర ఎన్నికల సమయంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ను ఆ సంస్థ మరోసారి వెల్లడించింది. తమ సర్వేలో మహారాష్ట్రలోని 32 శాతం మంది ఓటర్లు మళ్లీ ఫడ్నవిస్ సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అజిత్ పవార్ ను 11 శాతం మంది ఓటర్లు కోరుకున్నారని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో, అజిత్ పవార్ తో కలిసి బీజేపీ ఏ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతుందో ఆసక్తికరంగా మారిందని చెప్పింది. ఎన్సీపీని అజిత్ పవార్ చీల్చిన నేపథ్యంలో, ఆ పార్టీ ఎలా మనుగడ సాగిస్తుందో వేచి చూడాలని పేర్కొంది. ఇక వీడీపీ అసోసియేట్స్ సర్వే ప్రకారం ఎవరికి ఎంత ప్రజాదరణ ఉందంటే (శాతాల్లో):

  • దేవేంద్ర ఫడ్నవిస్ - 32
  • అజిత్ పవార్ - 11
  • ప్రకాశ్ అంబేద్కర్ - 9
  • నితిన్ గడ్కరీ - 7
  • ఉద్ధవ్ థాకరే - 6
  • రాజ్ థాకరే - 5
  • అశోక్ చవాన్ - 4
  • చగన్ భుజ్ బల్ - 3
  • పృథ్విరాజ్ చౌహాన్ - 2
  • సుశీల్ కుమార్ షిండే - 1

More Telugu News