Maharashtra: శివసేనకు షాక్: మహారాష్ట్రలో రాత్రికి రాత్రే మారిన రాజకీయం.. సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం.. చేతులు కలిపిన అజిత్ పవార్!

  • ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న శివసేనకు అజిత్ పవార్ భారీ షాక్
  • ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం
  • మహారాష్ట్రలో ప్రతిష్ఠంభనకు తెర

మహారాష్ట్రలో సంక్షోభానికి తెరపడింది. రాత్రికి రాత్రే పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న శివసేనకు ఎన్సీపీ భారీ షాకిచ్చింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో జట్టు కట్టిన బీజేపీ ఆగమేఘాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కొద్దిసేపటి క్రితం దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన కాసేపటికే ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర భవిష్యత్తు కోసం వారు కష్టపడి పనిచేస్తారని నమ్ముతున్నట్టు పేర్కొంటూ కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

ప్రభుత్వ ఏర్పాటు అనంతరం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ప్రజలు బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చారని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, కిచిడీ ప్రభుత్వాన్ని కాదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ.. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీతో చేతులు కలిపినట్టు చెప్పారు.

More Telugu News