Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • సమంతకు భారీ పారితోషికం 
  • తేజ దర్శకత్వంలో గోపీచంద్ 
  • బన్నీ ఫుల్ మాస్ క్యారెక్టర్ 

   *  అందాల సమంత అటు సినిమాలలో నటిస్తూనే, తొలిసారిగా ఇటు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్న సంగతి విదితమే. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న 'ఎ ఫ్యామిలీ మ్యాన్' పేరిట రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ లో నటిస్తున్నందుకు ఈ ముద్దుగుమ్మకు భారీ మొత్తంలో పారితోషికం ముడుతోందట. ఎంత మొత్తం అన్నది వెల్లడి కానప్పటికీ, సినిమా పారితోషికం కంటే ఎక్కువేనని తెలుస్తోంది.  
*  ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న యాక్షన్ హీరో గోపీచంద్ దీని తర్వాత తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలవ్వచ్చని తెలుస్తోంది.
*  సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో బన్నీ ఫుల్ మాస్ క్యారెక్టర్ ను చేయనున్నాడని అంటున్నారు. ఇది ఎమోషన్ తో కూడిన యాక్షన్ చిత్రంగా రూపొందుతుందట.  

More Telugu News