ఏపీలో ప్రస్తుతమున్న బార్ల లైసెన్సులన్నీ రద్దు... ప్రభుత్వం కీలక నిర్ణయం

Fri, Nov 22, 2019, 07:52 PM
  • కొత్త బార్ల పాలసీ నోటిఫికేషన్
  • జనవరి 1 నుంచి అమలు
  • రెండేళ్ల కాలపరిమితితో కొత్త లైసెన్సులు
  • దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలు
వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని బార్ల లైసెన్సులను రద్దు చేసింది. కొత్త బార్ల పాలసీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త బార్ల విధానం జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. నూతన విధానం ప్రకారం బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే తెరిచి ఉంచాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త బార్ల లైసెన్సులను రెండేళ్ల కాలపరిమితితో మంజూరు చేస్తారు. కాగా, బార్లకు దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలుగా నిర్ణయించారు. లాటరీ పద్ధతిలో బార్లు కేటాయిస్తారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha