Andhra Pradesh: పేదల అభ్యున్నతి కోసమే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం: ఏపీ తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి

  • పాదయాత్రలో పేదలకిచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారు
  • చంద్రబాబు తన హయాంలో ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముకాశారు
  • ఆయన వైఖరిమూలంగా సుమారు 6వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి

ఆంధ్రప్రదేశ్ లో నిరక్ష రాస్యత రూపుమాపడానికి సీఎం జగన్ చిత్త శుద్ధితో కృషి చేస్తున్నారని తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. రాష్ట్రంలో 35 శాతం నిరక్ష్యరాస్యత ఉందని ఆమె తెలిపారు. సీఎం రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యతే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారన్నారు. జగన్ పాదయాత్రలో తారసపడిన గిరిజనులు, మైనారిటీ వర్గాలకు చెందిన పేద, మధ్యతరగతి, ప్రజలు తమ పిల్లలు మంచి ఉద్యోగాలు చేపట్టాలనే అభిలాషను వ్యక్తం చేశారన్నారు. ఇందుకోసం తమకు ఆంగ్ల మాధ్యమంలో మంచి విద్య కావాలని కోరుతూ జగన్ కు తెలిపారన్నారు.

70శాతం దిగువ, ఎగువ, మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు పంపిస్తున్నారన్నారు. పేదవారికి కూడా ఆశలుంటాయన్నారు. పాదయాత్రలో హామీలను నెరవేర్చే క్రమంలో పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు తగవన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రైవేటు పాఠశాలలకు కొమ్ముకాశారని ఆరోపించారు. సుమారు 6వేల పాఠశాలలను మూయించిన ఘనత చంద్రబాబుకు దక్కిందని ఎద్దేవా చేశారు.

More Telugu News