Sensex: ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు

  • 215 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 54 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ టాటా స్టీల్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే పయనించాయి. హెవీ వెయిట్ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 215 పాయింట్లు పతనపై 40,359కి పడిపోయింది. నిఫ్టీ 54 పాయింట్లు కోల్పోయి 11,914 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (4.17%), ఎన్టీపీసీ (2.35%), వేదాంత లిమిటెడ్ (2.27%), ఓఎన్జీసీ (2.18%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.53%).

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.89%), టీసీఎస్ (-2.20%), ఏసియన్ పెయింట్స్ (-2.14%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.82%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-1.68%).

More Telugu News