Telangana: సీఎం సమీక్షలో కార్మికులు విధుల్లో చేరే అంశంపై మాట్లాడలేదు: అశ్వత్థామరెడ్డి

  • హైకోర్టు తీర్పు తర్వాత, సీఎం అనుకూలమైన ప్రకటన చేస్తారని ఆశిస్తున్నాం
  • రేపు అన్ని డిపోల ముందు నిరసన ర్యాలీలు చేపట్టడానికి ఆర్టీసీ జేఏసీ పిలుపు
  • సమ్మె విరమిస్తామని ప్రకటించాం.. ప్రభుత్వ నిర్ణయంకోసం ఎదురుచూస్తున్నాం

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై సీఎం కేసీఆర్ వైఖరిని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తప్పుబట్టారు. నిన్న సుమారు నాలుగున్నరకు పైగా సమ్మెపై అధికారులతో సమీక్షించిన కేసీఆర్ కార్మికులు విధుల్లో చేరే అంశంపై మాట్లాడలేదని ఆరోపించారు.  సమ్మె, ప్రైవేట్ రూట్ల అంశంపై ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కేసీఆర్ అనుకూలమైన ప్రకటన చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాము సమ్మె విరమిస్తామని ప్రకటించామని, అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు  కాగా, శనివారం రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు నిరసన, ధర్నా,ర్యాలీలు నిర్వహించాలని కార్మికులకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిందన్నారు.

More Telugu News