Maharashtra: మహారాష్ట్రలో కొత్త కూటమికి 'మహా వికాస్ అఘాడీ' పేరు?

  • దీనికి ‘మహా శివ అఘాడీ’ అని పేరు పెట్టాలన్న శివసేన 
  • ‘శివ’ పేరు తీసేయాలన్న కాంగ్రెస్-ఎన్‌సీపీ
  • కాంగ్రెస్‌ పార్టీ నుంచి బాలాసాహెబ్‌ థొరాట్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి?

మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ కూటమికి పెట్టే పేరు విషయంలో శివసేన-కాంగ్రెస్‌ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. దీనికి ‘మహాశివ అఘాడీ’ అని పేరు పెట్టాలని శివసేన పట్టుబట్టగా, అందులోంచి ‘శివ’ పేరు తీసేయాలని ‘మహా వికాస్‌ అఘాడీ’ అనే పేరు పెట్టాలని కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రతిపాదించినట్లు తెలిసింది.

మూడు పార్టీల మధ్య మంత్రి పదవుల సర్దుబాటుకి సంబంధించి అంగీకారం కుదిరింది. దీని ప్రకారం శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని సమాచారం. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలనుంచి ఒక్కో నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఎన్‌సీపీ నుంచి అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ఉంటారని కూడా ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బాలాసాహెబ్‌ థొరాట్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 

More Telugu News