India: ఆఫ్ఘనిస్థాన్ లో భారత్ పాత్ర అద్భుతం: కొనియాడిన అమెరికా

  • ఆఫ్ఘన్ కు భారత్ అందిస్తోన్న సహకారాన్ని స్వాగతిస్తున్నాం
  • ఇప్పటికే మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందజేసింది
  • ఆఫ్ఘన్ విషయంలో భారత్ కు అమెరికా మద్దతు 

ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ బలగాల్ని ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ దేశానికి భారత్ సాయాన్ని కొనసాగించడాన్ని అమెరికా కొనియాడింది. ఆఫ్ఘన్ కు భారత్ అందిస్తోన్న సహకారాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. 2001లో తాలిబన్లపై అమెరికా పోరాటానికి దిగిన నాటి నుంచి భారత్ మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందజేసిందని తెలిపింది.  

ఓ కార్యక్రమంలో అమెరికాకు చెందిన ఆఫ్ఘనిస్థాన్ విభాగం ఇన్ ఛార్జి జాక్సన్ మాట్లాడుతూ... ఆఫ్ఘన్ విషయంలో భారత్ కు అమెరికా మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. దక్షిణాసియాపై అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగా భారత్ తో తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సత్సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు. ఆఫ్ఘన్ లో తాలిబన్లతో జరుగుతున్న యుద్ధానికి తెరదించాలని తమ దేశం కోరుకుంటోందని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. వివిధ రంగాల్లో 400 ప్రాజెక్టులను పూర్తిచేసిందని కొనియాడారు.

More Telugu News