IMD: బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అవకాశం.. వర్షాలు పడే అవకాశం!

  • మరో వారంలో అల్పపీడనం
  • ఆపై వాయుగుండంగా మారే చాన్స్
  • ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాలను మరోసారి వర్షాలు పలకరించనున్నాయి. హిందూ మహా సముద్రానికి అనుబంధంగా దక్షిణ బంగాళాఖాతంలో మరో వారంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని, ఆపై పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

 దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కాగా, ఇప్పటికే తూర్పు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో తమిళనాడుతో పాటు, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. రాగల 24 గంటలు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు.

More Telugu News