Narendra Modi: ప్రధాని నరేంద్రమోదీ విదేశీ ప్రయాణ ఖర్చులు ఎన్ని వందల కోట్లంటే..!

  • 2016-19 మధ్య రూ.225 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం
  • రాజ్యసభకు తెలిపిన కేంద్రమంత్రి మురళీధరన్
  • 2017-18లో అత్యధికంగా రూ.99.32 కోట్లు

భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనల కోసం భారత ప్రభుత్వం గత మూడేళ్లలో రూ.225 కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు నిన్న ప్రభుత్వం పెద్దల సభకు తెలిపింది. 2016-19 మధ్య విదేశీ ప్రయాణాల కోసం మోదీ ఉపయోగించిన చార్టర్డ్ విమానాల కోసం రూ.225 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్రమంత్రి మురళీధరన్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. 2016-17 సంవత్సరంలో రూ. 76.27 కోట్లు, 2017-18లో రూ.99.32 కోట్లు, 2018-19లో రూ. 79.91 వెరసి రూ.225 కోట్లు ఖర్చు అయినట్టు మంత్రి వివరించారు.

More Telugu News