RTC workers Strike: ఆర్టీసీపై ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

  • అర్టీసీ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన.. పరిణామాలపై చర్చ
  • హాజరైన మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్ జోషి, అధికారులు
  • నాలుగు గంటలకుపైగా కొనసాగిన భేటీ

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలకు పైగా ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో రవాణా శాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఆర్టీసీ ఇన్ ఛార్జీ ఎండీ సునీల్ శర్మ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరతామని ప్రకటించిన నేపథ్యంలో సీఎం ఈ సమీక్షను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రూట్ల పర్మిట్లపై రేపు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత   సమ్మెపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని సమాచారం.  ఆర్టీసీ సమస్యపై రేపు కూడా  మరోసారి సీఎం సమీక్ష చేపడతారని తెలుస్తోంది. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఆర్టీసీ అప్పులపై చర్చలు సాగాయి. ఆర్టీసీని ప్రస్తుతమున్న పరిస్థితిలో కొనసాగించే పరిస్థితి లేదని సమీక్షలో అభిప్రాయం వ్యక్తమైందని తెలుస్తోంది.

More Telugu News