శ్రీశైలం డ్యాం భద్రతపై మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలు

- డ్యాం భద్రతపై రాజేంద్రసింగ్ సందేహాలు
- ఎలాంటి ఢోకా లేదన్న మంత్రి అనిల్ కుమార్
- ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని వెల్లడి
శ్రీశైలం ప్రాజెక్టు పటిష్టతను అంచనా వేసేందుకు బేతీమెట్రిక్ సర్వే చేయించామని, జలాంతర్భాగాన్ని వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించామని వెల్లడించారు. దీనిపై నివేదిక వస్తే దాన్నిబట్టి తదుపరి చర్యలు ఉంటాయని, డ్యాంను గ్యాలరీ ఇంజినీరింగ్ విభాగం నిరంతరం తనిఖీ చేస్తుంటుందని వివరించారు. కాగా, డ్యాం భద్రతపై రాజేంద్రసింగ్ సందేహాలు లేవనెత్తిన నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ సంబంధిత శాఖను ఆదేశించి శ్రీశైలం డ్యాం ప్రస్తుత స్థితిపై నివేదిక తెప్పించుకున్నారు.