21 years Old Mayank became Justice: న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న అత్యంత పిన్న వయస్కుడు మయాంక్ ప్రతాప్!

  • 21 ఏళ్లకే న్యాయ పీఠం అధిష్ఠిస్తూ రికార్డ్ నమోదు
  • రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలో టాపర్ గా నిలిచిన మయాంక్
  • మయాంక్ ను అభినందిస్తూ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు ట్వీట్లు

జైపూర్ లోని మాన్ సరోవర్ కు చెందిన 21ఏళ్ల మయాంక్ ప్రతాప్ న్యాయమూర్తిగా భాధ్యతలు చేపట్టి.. దేశంలో, అతి తక్కువ వయసులోనే న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఎల్ ఎల్ బీ డిగ్రీని పూర్తి చేసిన మయాంక్ అనంతరం జరిగిన రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమేకాక, టాపర్ గా నిలిచాడు. గతంలో ఈ పరీక్షకు అర్హత వయసు 23 ఏళ్లుగా ఉండేది. ఈ ఏడాది అర్హత వయసును 21ఏళ్లకు తగ్గించడంతో మయాంక్ కు ఆర్ జేఎస్ రాయడానికి వీలు కలిగింది. ఇక మయాంక్ కు అభినందనలు తెలుపుతూ  రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ తో పాటు పలువురు ట్వీట్ చేశారు.

More Telugu News