పారితోషికాన్ని పెంచుకుంటూ వెళుతున్న నయనతార

- తెలుగు .. తమిళ భాషల్లో క్రేజ్
- పాత్రలో ఒదిగిపోవడం ఆమె ప్రత్యేకత
- కథకి .. తన పాత్రకి ప్రాధాన్యతనిచ్చే నయన్
ఈ కారణంగానే రోజురోజుకి ఆమె క్రేజ్ పెరిగిపోతోంది .. దానితో పాటే ఆమె తన పారితోషికాన్ని పెంచేస్తోంది. కొంతకాలం క్రితం నయనతార తన పారితోషికంగా 4 కోట్లు తీసుకుంటే, దక్షిణాదికి చెందిన మిగతా కథానాయికలు ఆశ్చర్యపోయారు. ఇక ఇటీవల కథ .. తన పాత్రకిగల ప్రాముఖ్యతను బట్టి ఆమె 7 నుంచి 8 కోట్లు అడుగుతోందట. నయనతారకి గల క్రేజ్ కారణంగా ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.