Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 76 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 30 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా పడిపోయిన టాటా స్టీల్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 76 పాయింట్లు కోల్పోయి 40,575కు పడిపోయింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 11,968 వద్ద స్థిరపడింది. రియాల్టీ, కన్జ్యూమర్ గూడ్స్, ఫైనాన్స్, ఐటీ టెక్ సూచీలు లాభాలను నమోదు చేశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (1.15%), ఎల్ అండ్ టీ (0.89%), బజాజ్ ఆటో (0.82%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.81%), హెచ్డీఎఫ్సీ (0.75%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.35%), భారతి ఎయిర్ టెల్ (-2.52%), యస్ బ్యాంక్ (-2.43%), ఐటీసీ (-1.96%), యాక్సిస్ బ్యాంక్ (-1.78%).

More Telugu News