Srisailam: శ్రీశైలం డ్యామ్ ఫౌండేషన్ లో గ్యాప్ ఉందని నేను ముందే చెప్పా: తెలంగాణ ఇరిగేషన్ శాఖ రిటైర్ట్ చీఫ్ సాంబయ్య

  • రాజేంద్ర సింగ్ అభిప్రాయం తప్పు కాదు
  • ఫౌండేషన్ లో గ్యాప్ ఉందని 2008లోనే నేను చెప్పా
  • ఏపీ ప్రభుత్వం కమిటీ వేసి చర్యలు చేపట్టాలి

శ్రీశైలం డ్యామ్ పరిస్థితి ప్రమాదకరంగా ఉందంటూ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్యామ్ ముందు భాగంలో గొయ్యి ఏర్పడిందని, గేట్లు ఎత్తేసిన ప్రతిసారి ఆ గొయ్యి పెద్దదవుతూ, డ్యామ్ వైపుకు విస్తరిస్తోందని ఆయన అన్నారు. ఆనకట్ట తెగితే ఏపీకి పెను ముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ చీఫ్ సాంబయ్య స్పందించారు.

డ్యామ్ ఫౌండేషన్ లో గ్యాప్ ఉందని తాను 2008లోనే చెప్పానని సాంబయ్య తెలిపారు. రూ. 14 కోట్లు ఖర్చు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని కూడా చెప్పానని అన్నారు. రాజేంద్రసింగ్ అభిప్రాయం ఏమాత్రం తప్పుకాదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే ఓ కమిటీని వేసి చర్యలు చేపట్టాలని సూచించారు. డ్యామ్ మొదటి గేట్, చివరి గేట్ ల దగ్గర గుట్టకు సపోర్ట్ గా గోడలను నిర్మించాలని చెప్పారు. శ్రీశైలం డ్యామ్ పై నిర్లక్ష్యం వహిస్తే ముప్పు తప్పదని హెచ్చరించారు.

More Telugu News