ఈ సినిమాతో జార్జిరెడ్డి మళ్లీ పుడతాడు: దర్శకుడు జీవన్

Thu, Nov 21, 2019, 02:03 PM
  • ఈ సినిమా కోసం ఐదేళ్లు కష్టపడ్డా
  • అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలనే సందేశం సినిమాలో ఉంటుంది
  • ఈ సినిమా హింసను ప్రేరేపించే విధంగా ఉంటుందన్న వాదనలో నిజం లేదు
విద్యార్థి నేత, పీడీఎస్యూ వ్యవస్థాపకుడు జార్జిరెడ్డి జీవిత కథతో తెరకెక్కిన 'జార్జ్ రెడ్డి' చిత్రం రేపు విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ నేడు నారాయణగూడ శ్మశానవాటికలో ఉన్న జార్జిరెడ్డి సమాధి వద్ద ఘన నివాళి అర్పించింది.  ఈ కార్యక్రమంలో హీరో సందీప్ మాధవ్, దర్శకుడు జీవన్ రెడ్డితో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ... నీతి, నిజాయతీని నిలువెల్లా నింపుకున్న విద్యార్థి నేత జార్జ్ రెడ్డి అని చెప్పారు. ఈ సినిమా కోసం ఐదేళ్లు కష్టపడ్డానని తెలిపారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ మెట్లపై పడుకుని జార్జి రెడ్డి గుండె చప్పుడును తాను విన్నానని చెప్పారు. ఈ సినిమా హింసను ప్రేరేపించే విధంగా ఉంటుందన్న వాదనలో నిజం లేదని... అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలనే సందేశం ఉంటుందని తెలిపారు. తమ చిత్రంతో జార్జ్ రెడ్డి మళ్లీ పుడతాడని చెప్పారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement