Kamal Haasan: ఆసుపత్రిలో చేరనున్న కమలహాసన్... రేపు శస్త్రచికిత్స!

  • 2016లో కమల్ కు ప్రమాదం
  • అప్పట్లో కాలిలో ఇంప్లాంట్స్ అమర్చిన వైద్యులు
  • వాటిని తొలగించేందుకు రేపు ఆపరేషన్

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్, ఓ శస్త్రచికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరనున్నారు. పార్టీ తరఫున మీడియాకు విడుదలైన ప్రకటనలోని వివరాల మేరకు, కమల్ కు శుక్రవారం నాడు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. 2016లో ఆయన ఓ ప్రమాదానికి గురికాగా, కాలులో ఇంప్లాంట్ ను అమర్చారు. ఇప్పుడు దాన్ని తీసేసే సమయం ఆసన్నమైందని పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్ మహేంద్రన్ వెల్లడించారు.

ఆపరేషన్ తరువాత ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు. ఈ శస్త్రచికిత్స గతంలోనే జరగాల్సి వుందని, అయితే పార్టీ కార్యకలాపాల కారణంగా వాయిదా పడుతూ వచ్చిందని పేర్కొన్నారు. 

More Telugu News