'చంద్రముఖి' సెట్లోకి నేను రావడం చూసి ప్రభు మండిపడ్డాడు: సీనియర్ విలన్ విజయరంగరాజు

- రజనీకాంత్ గారిని కలవడానికి వెళ్లాను
- ప్రభు తన కోపానికి కారణం చెప్పారు
- రజనీ ఆత్మీయంగా పలకరించారన్న విజయరంగరాజు
నేను లోపలికి రావడం చూసిన ప్రభుగారు, 'ఎందుకు పంపించారు?' అంటూ ఆ సెక్యూరిటీ ఆఫీసర్ పై మండిపడ్డారు. దాంతో నేను వెనక్కి తిరిగాను. అంతకుముందురోజు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి, జూనియర్ ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టారట. అందువలన ఎవరినీ లోపలికి వదలొద్దని ప్రభు సీరియస్ గా చెప్పారట. ఆ విషయాన్ని ఆయనే చెబుతూ, రజనీ వున్న కారవాన్ లోకి నన్ను పంపించారు. రజనీ నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ సినిమాలో నాకు వేషం ఇప్పించడానికి ప్రయత్నించారుగానీ, అప్పటికే చాలా వరకూ షూటింగు అయిన కారణంగా కుదరలేదు" అని చెప్పుకొచ్చాడు.