పేటీఎం నుంచి 'కేవైసీ' మెసేజ్ వచ్చిందా?... దయచేసి నమ్మవద్దంటూ సీఈఓ అర్జంట్ మెసేజ్!

- పేటీఎం పేరిట నకిలీ సందేశం
- యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సమాచారం
- మోసగాళ్ల మాయలో పడవద్దన్న విజయ్ శేఖర్ శర్మ
పేటీఎం ఎన్నడూ ఇటువంటి వివరాలను అడగబోదని ఆయన స్పష్టం చేశారు. ఏ విధమైన యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలని కూడా తాము సూచించబోమని తెలిపారు. బహుమతుల మాయలో పడవద్దని సూచించారు. ఖాతా వివరాలను హ్యాక్ చేసేందుకు మోసగాళ్లు చేస్తున్న పని ఇదని, దీనిపై తాము ఇప్పటికే ఫిర్యాదు చేశామని అన్నారు.