Karthikeya: '90ML' ట్రైలర్ తో దుమ్మురేపేస్తున్న కార్తికేయ

  • కార్తికేయ నుంచి విభిన్న కథా చిత్రం 
  • కథానాయికగా నేహా సోలంకి పరిచయం 
  •  డిసెంబర్ 5వ తేదీన విడుదల 

కార్తికేయ కథానాయకుడిగా దర్శకుడు శేఖర్ రెడ్డి '90ML ' సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ద్వారా నేహా సోలంకి కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరోకి చిన్నప్పటి నుంచి వున్న ఒక హెల్త్ ప్రోబ్లం వలన, మూడు పూటలా మూడుసార్లు 90ML తాగాలి.

ఈ విషయమే ఆయన ప్రేమను .. పెళ్లిని ఎలాంటి మలుపులు తిప్పిందనేదే కథ అనే సంగతి ఈ ట్రైలర్ చెబుతోంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ తండ్రి పాత్రలో రావు రమేశ్ .. ప్రతినాయకుడి పాత్రలో రవికిషన్ కనిపిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో వస్తున్న ఈ సినిమాతో కార్తికేయ హిట్ కొడతాడేమో చూడాలి.

More Telugu News