వేగంగా వెళుతోన్న బస్సు నుంచి దూకి ఆత్మహత్య.. తోటి ప్రయాణికులు పట్టుకున్నా విడిపించుకున్న వైనం

Thu, Nov 21, 2019, 11:28 AM
  • విజయనగరం జిల్లాలో ఘటన
  • విశాఖపట్నం వెళుతూ దూకేసిన వ్యక్తి
  • అతడి తలపై నుంచి వెళ్లిన లారీ
వేగంగా వెళుతోన్న బస్సు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. అతడు బస్సులోంచి దూకాలని చూస్తోన్న విషయాన్ని తోటి ప్రయాణికులు గమనించి అతడిని పట్టుకోవాలని చూసినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. వైద్యపరీక్షల కోసం ఆ వ్యక్తి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీ బస్సులో వెళుతూ ఒక్కసారిగా ఈ ఘటనకు పాల్పడ్డాడు.

విజయనగరంలోని పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం వద్ద  అతడు బస్సులోంచి దూకేయడంతో వెనుక నుంచి వస్తున్న లారీ అతడి తలపై నుంచి వెళ్లింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి పేరు, వివరాలపై ఆరా తీస్తున్నారు. అతడి వద్ద ఆరోగ్య పరీక్షల రిపోర్టులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement