అరుదైన గౌరవం.. స్టేడియంలోని స్టాండుకు గంభీర్ పేరు

Thu, Nov 21, 2019, 11:14 AM
  • అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలోని ఒక స్టాండ్ కు గంభీర్ పేరు
  • వచ్చే రంజీ సీజన్ నుంచి అందుబాటులోకి రానున్న స్టాండ్
  • ఇప్పటికే ఓ స్టాండ్ కు కోహ్లీ పేరు
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలోని ఓ స్టాండ్ కు ఆయన పేరును పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) సంయుక్త కార్యదర్శి రాజన్ మంచండా మాట్లాడుతూ, దేశ క్రికెట్ కు గంభీర్ చేసిన సేవలకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించామని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ కూడా ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసిందని తెలిపారు.

వాస్తవానికి స్టేడియంలోని ఓ స్టాండ్ కు గంభీర్ పేరు పెట్టాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉందని.... దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికి పూర్తయ్యాయని రాజన్ మంచండా చెప్పారు. వచ్చే రంజీ సీజన్ నుంచి ఈ స్టాండ్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ స్టాండ్ లో ఓ స్టాండ్ కి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు పెట్టారు. ఇప్పుడు గంభీర్ కు అలాంటి గౌరవమే దక్కనుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement