అద్భుత నిర్మాణం... కమాండ్ కంట్రోల్ సెంటర్ రెడీ: కేటీఆర్

Thu, Nov 21, 2019, 11:02 AM
  • కేసీఆర్ మానస పుత్రికగా సీసీసీ
  • త్వరలోనే ప్రారంభోత్సవం
  • సోషల్ మీడియాలో కేటీఆర్
హైదరాబాద్ లోని బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 17 అంతస్తుల్లో నిర్మించిన ఈ సెంటర్ నుంచి హైదరాబాద్ లోని అణువణువునూ చూడవచ్చు. ప్రతి వీధిలోనూ నిఘాను పెట్టవచ్చు. ఇండియాలోనే తొలిసారిగా ఈ తరహా సెంటర్ తెలంగాణలో ఏర్పాటైంది. ఇక ఈ భవంతి నిర్మాణం పూర్తయిందని తెలుపుతూ, తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్, తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా నిర్మితమైన అద్భుత భవంతి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement