'బిచ్చగాడు' హీరో తాజా చిత్రంగా 'జ్వాల'

Thu, Nov 21, 2019, 10:57 AM
  • 'బిచ్చగాడు'తో తొలి హిట్ 
  • యాక్షన్ ఎంటర్టైనర్ గా 'జ్వాల'
  • వివిధ దేశాల్లో జరిగిన చిత్రీకరణ
తెలుగు ప్రేక్షకులకి విజయ్ ఆంటోని 'బిచ్చగాడు' సినిమాతో చేరువయ్యాడు. ఆ తరువాత ఆయన విభిన్నమైన చిత్రాలనే చేస్తూ వచ్చాడు. అయితే అవేవి 'బిచ్చగాడు' స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరో సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.

విజయ్ ఆంటోని కథానాయకుడిగా తమిళంలో 'అగ్ని సిరగుగుల్' అనే సినిమా రూపొందుతోంది. నవీన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తెలుగులో 'జ్వాల' అనే టైటిల్ ను ఖరారు చేశారు. శీను అనే ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఫస్టులుక్ ను వదిలారు. అక్షర హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను గురించి దర్శకుడు నవీన్ మాట్లాడుతూ .."యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నాము. విజువల్ ఫీస్ట్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాము. రష్యా .. మాస్కో .. కజకిస్థాన్ లోని అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరించాము. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి" అని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha