సుకుమార్ మూవీలో రష్మిక పాత్రను గురించి ఫిల్మ్ నగర్ టాక్

Thu, Nov 21, 2019, 09:41 AM
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సుకుమార్ 
  •  డీ గ్లామర్ పాత్రలో రష్మిక 
  •  ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించనుందంటూ మరో టాక్
సుకుమార్ తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ - రష్మిక జంటగా కనిపించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన జోడీగా రష్మిక ఎలా కనిపించనుందనే ఆసక్తి అభిమానుల్లో చోటుచేసుకుంది.

ఈ సినిమాలో ఆమె ఓ గిరిజన యువతిగా కనపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. సహజత్వం కోసం ఈ పాత్రలో ఆమె, 'రంగస్థలం' సినిమాలో సమంత మాదిరిగా డీ గ్లామర్ గా కనిపించనుందని అంటున్నారు. ఇక మరో వైపున ఆమె ఫారెస్ట్ ఆఫీసర్ గా కూడా కనిపించనుందనే మరో టాక్ కూడా ఫిల్మ్ నగర్లోనే షికారు చేస్తోంది. మరి ఈ రెండింటిలో రష్మిక ఏ పాత్రలో కనిపిస్తుందో .. ఎంతగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad