leopard: తల్లి నుంచి తప్పిపోయి చెరకు తోటలోకి వచ్చిన చిరుత పిల్లలు.. తల్లికి అప్పగించిన అధికారులు

  • తోటను నరికేందుకు వచ్చిన రైతుకు కనిపించిన చిరుత పిల్లలు
  • వాటి వయసు 25 రోజులు ఉంటుందని తేల్చిన అధికారులు
  • అడవిలో వదిలిపెట్టగానే వచ్చి తీసుకెళ్లిన తల్లి

మహారాష్ట్రలోని షిరూర్ అటవీ రేంజ్ పరిధిలోని నాగర్‌గామ్‌లోని ఓ చెరకుతోటలో మూడు చిరుతపులి పిల్లలు లభ్యమయ్యాయి. తోటను నరికేందుకు వచ్చిన రైతుకు అవి కనిపించాయి. దీంతో ఆయన అటవీ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే తోట వద్దకు చేరుకున్న అధికారులు పిల్లలను పట్టుకుని వైద్య పరీక్షలు చేయించారు. వాటి వయసు 25 రోజులు ఉంటుందని అధికారులు తెలిపారు.

లభ్యమైన మూడు పిల్లలలో ఒకటి మగది కాగా, మిగతా రెండు ఆడ పిల్లలని తెలిపారు. అవి ఆరోగ్యంగానే ఉన్నాయని తెలిపారు.  అనంతరం వాటిని ఓ పెట్టెలో పెట్టి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఆ పెట్టెను పెట్టిన కాసేపటికే తల్లి చిరుత వచ్చి పిల్లలను నోట కరచుకుని అడవిలోకి తీసుకెళ్లింది.  

More Telugu News