శ్రీలంకలో అన్నదమ్ముల పాలన.. తమ్ముడు అధ్యక్షుడు.. అన్న ప్రధాని!

21-11-2019 Thu 08:42
  • ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినా గోటబాయ రాజపక్స
  • అన్న మహీందను ప్రధానిగా నియమించిన వైనం
  • రెండు శక్తిమంతమైన పదవుల్లో అన్నదమ్ములు
శ్రీలంక ప్రధానిగా మహీంద రాజపక్స నియమితులయ్యారు. ఈ మేరకు కొత్త అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ప్రకటించారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న మహీంద నేడు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రస్తుత ప్రధాని రణీల్ విక్రమసింఘే బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. కాగా, ఇప్పుడు శ్రీలంకలో రెండు శక్తిమంతమైన పదవుల్లో అన్నదమ్ములు ఉండడం గమనార్హం. తమ్ముడైన గొటబాయ రాజపక్స అధ్యక్షుడు కాగా, అన్న మహీంద రాజపక్స ప్రధాని పదవులు చేపట్టడం గమనార్హం.