Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ!

  • 6 కంపార్టుమెంట్లలో భక్తులు
  • నాలుగు గంటల్లోనే స్వామి దర్శనం
  • నిన్న హుండీ ఆదాయం రూ. 3.22 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. నిత్యమూ కిటకిటలాడిపోయే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బోసిపోతోంది. ఈ ఉదయం కేవలం 6 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు స్వామి సర్వ దర్శనానికి వేచి చూస్తున్న పరిస్థితి. వీరికి గరిష్ఠంగా నాలుగు గంటల్లో దర్శనం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. టైమ్ స్లాట్, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగివున్న భక్తులకు 2 నుంచి మూడు గంటల్లోనే దర్శనం అవుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 59,985 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,440 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.22 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ పేర్కొంది.

More Telugu News