kolkata: డీఆర్ఐ అధికారుల సోదాలు.. కంపెనీ కిటికీ నుంచి రోడ్లపైకి నోట్ల వర్షం!

  • కోల్‌కతాలోని ఓ కంపెనీలో డీఆర్ఐ అధికారుల సోదాలు
  • పక్కనే ఉన్న మరో సంస్థ కిటికీ నుంచి గాల్లోకి నోట్ల కట్టలు
  • పట్టుకునేందుకు ఎగబడిన జనం

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ భవనం నుంచి నిన్న మధ్యాహ్నం నోట్ల వర్షం కురిసింది. ఆరో అంతస్తు నుంచి కిందపడుతున్న నోట్లను పట్టుకునేందుకు కిందున్న జనం ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా రద్దీగా మారింది. బెంటిక్ స్ట్రీట్‌లోని ఓ భవనంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు జరిపారు. విషయం తెలిసిన పక్కనే ఉన్న హోఖ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిబ్బంది ఆరో అంతస్తులోని కిటికీ నుంచి నోట్ల కట్టలను కిందికి విసిరేశారు.

పై నుంచి కురుస్తున్న నోట్ల వర్షాన్ని చూసిన జనం తొలుత ఆశ్చర్యపోయారు. ఆపై తేరుకుని అందినంత పట్టుకుని ఎంచక్కా వెళ్లిపోయారు. కిందపడిన నోట్లలో రూ.2,000, రూ.500, రూ.100 నోట్లు ఉన్నాయి. నోట్లు విసిరేసిన ఘటనపై డీఆర్ఐ అధికారులు మాట్లాడుతూ.. తమ సోదాలకు, నోట్లు వెదజల్లడానికి కారణం ఉందని అనుకోవడం లేదన్నారు.

More Telugu News