George Reddy: ఆ రోజున జార్జిరెడ్డి, నేను కాలేజ్ క్యాంటీన్ బయట కూర్చున్నాం: తమ్మారెడ్డి భరద్వాజ

  • ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం
  • భోజనం చేద్దామన్నాను.. ‘తినను’ అన్నాడు
  • లైబ్రరీ వద్ద దింపమంటే దింపాను.. ఆ తర్వాత హత్య చేశారు

నాటి విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. వాస్తవాలను వక్రీకరించి అబద్ధాలను ఈ చిత్రంలో చూపిస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జార్జిరెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు వున్న ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు ఆసక్తికరంగా వున్నాయి. జార్జిరెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులు, అప్పటి పరిస్థితుల గురించి తమ్మారెడ్డిని కలిసిన మీడియాకు వివరించారు.

‘ఆ రోజున నేను, జార్జిరెడ్డి కాలేజీ క్యాంటీన్ బయట పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ మాట్లాడుకుంటూ కూర్చున్నాం. నాకు ఆకలేస్తోంటే.. ‘భోజనం చేద్దాం రారా’ అంటే ‘నేను తినను’ అన్నాడు. ‘లైబ్రరీ మే చోడ్ దే’ అంటే.. లైబ్రరీలో విడిచిపెట్టి వచ్చాను. నేను భోజనానికి వెళ్లిపోయాను. భోజనం చేసిన తర్వాత బోరు కొడుతుంటే.. నారాయణగూడ నుంచి మళ్లీ వాపసు వస్తుంటే. మా హాస్టల్ పిల్లలు ఆపి.. ‘జార్జిని పొడిచేశారు.. నువ్వు పోకు’ అన్నారు’ అని గుర్తుచేసుకున్నారు. జార్జిరెడ్డిని పొడిచేసిన ప్రదేశం వద్దకు తాను వెళ్లేటప్పటికే ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లిపోయారు.

More Telugu News