sharad pawar: ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ.. సమస్యలపై లేఖ అందజేత

  • మహారాష్ట్రలో రైతుల సమస్యలపై మోదీకి వివరణ
  • మోదీతో పవార్ మహారాష్ట్ర రాజకీయాలు కూడా చర్చ
  • రాష్ట్రపతి పాలన విధించిన విషయాన్ని ప్రస్తావించిన పవార్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్  భేటీ ముగిసింది. మహారాష్ట్రలో రైతుల సమస్యలపై మోదీకి ఆయన ఓ లేఖ అందజేశారు. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని రెండు జిల్లాల రైతులు పూర్తిగా నష్టపోయారని, పెద్ద మొత్తంలో పంట దెబ్బతిందని చెప్పారు. మరాట్వాడా, విదర్భల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.  దీనికి సంబంధించిన సమాచారం అంతా తన వద్ద ఉన్నట్లు పవార్ తెలిపారు.

మోదీతో పవార్ మహారాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చించినట్లు సమాచారం.  అలాగే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కూడా ఆయన ప్రస్తావించారు. మహారాష్ట్రలోని పరిస్థితులపై చొరవ తీసుకుని చక్కదిద్దాలని కోరినట్లు సమాచారం. కాగా, ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ కూడా పాల్గొనడం గమనార్హం.



More Telugu News