Rajya Sabha: ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకే అంతర్జాల సేవలను నిలిపేశాం: జమ్మూ కశ్మీర్ పరిస్థితులపై అమిత్ షా వివరణ

  • సరైన సమయంలో టెలికాం సేవలను పునరుద్ధరిస్తున్నాం
  • మెడికల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాం
  • వేలాది పాఠశాలలు ఇప్పటికే తెరుచుకున్నాయి

జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు అదుపులో ఉన్నాయని  కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూకశ్మీర్ లోని పరిస్థితులపై రాజ్యసభలో ఈ రోజు ఆయన మాట్లాడారు. సరైన సమయంలో టెలికాం సేవలను పునరుద్ధరిస్తున్నామని, ప్రస్తుతం ల్యాండ్ లైన్, పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలు అందుతున్నాయని చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకే అక్కడ అంతర్జాల సేవలను నిలిపేశామన్నారు. త్వరలోనే దీన్ని కూడా పునరుద్ధరిస్తామని వివరించారు. మెడికల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో రోగులకు తగినన్ని సౌకర్యాలన్నీ అందుతున్నాయన్నారు.

జమ్మూ కశ్మీర్ లో ఇప్పుడు ఎటువంటి సమస్యలూ లేవని చెప్పారు. అక్కడ వేలాది పాఠశాలలు ఇప్పటికే తెరుచుకున్నాయని అమిత్ షా తెలిపారు. టీవీ నెట్ వర్క్ లు పని చేస్తున్నాయని, వార్తా పత్రికలు గతంలోలాగే పనిచేస్తున్నాయని వివరించారు. రవాణా సదుపాయాలు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

More Telugu News