Hyderabad: హైదరాబాద్ లో 'సాఫ్ట్‌వేర్' యువతి ఆత్మహత్య

  • మాదాపూర్‌లోని ఓ సంస్థలో పనిచేస్తోన్న హరిణి
  • హాస్టల్ లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్న యువతి
  • ఉద్యోగం కోల్పోతాననే మనస్తాపంతోనే ఆత్మహత్య?

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఓ లేడీస్ హాస్టల్‌లో ఉంటోన్న పి.హరిణి (24) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మాదాపూర్‌లోని గోల్డెన్‌హిల్స్ క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో రెండున్నరేళ్లుగా పని చేస్తోంది. ఈ రోజు ఉదయం కార్యాలయానికి వెళ్లకుండా హాస్టల్ లోనే ఉన్న ఆమె... చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. ఉద్యోగం కోల్పోతాననే మనస్తాపంతోనే హరిణి ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ నెలతో ఆమె ఉపాధి ముగియనుంది. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆత్మహత్యపై దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News