Kiran: దూసుకుపోతున్న 'రాజావారు రాణిగారు' ట్రైలర్

  • తెలుగు తెరపైకి మరో ప్రేమకథ 
  • నాయకా నాయికలుగా కిరణ్ - రహస్య పరిచయం 
  • ఈ నెల 29వ తేదీన విడుదల 

సినిమాలు చూడటానికి యూత్ ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటుంది. అందువల్లనే యువ దర్శకులు తమ తొలి సినిమాకి ప్రేమకథలనే ఎక్కువగా ఎంచుకుంటూ వుంటారు. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన మరో ప్రేమకథనే 'రాజావారు రాణిగారు'.

కిరణ్ - రహస్య జంటగా రవికిరణ్ కోలా రూపొందించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో రాజా అనే ఒక అబ్బాయి .. రాణి అనే ఒక అమ్మాయి మధ్య చోటుచేసుకునే ప్రేమకథలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. సహజత్వానికి దగ్గరగా మలచబడిన సన్నివేశాలతో సాగే ఈ ట్రైలర్, యూత్ ను ఆకట్టుకుంటూ, ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటోంది.

More Telugu News