Chandrababu: ఈ పరిస్థితి చాలా ఎంబరాసింగ్ గా ఉంది.. గతంలో ఎప్పుడూ లేదు!: జగన్ పై చంద్రబాబు ఫైర్

  • ఏపీపై కేసులు వేయనున్న గ్లోబల్ కంపెనీలు
  • ఆంగ్ల మీడియా కథనాన్ని ప్రస్తావించిన చంద్రబాబు
  • గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గ్లోబల్ కంపెనీలు కేసులను వేయనున్నాయని నేడు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన చంద్రబాబు, వీటిని చూస్తుంటే తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత జూలైలో పలు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుల బిడ్డింగ్ లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం కారణాలు చూపింది. ఇక దీనిపై క్రిసిల్ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ, ఏపీలో భవిష్యత్ పెట్టుబడులకు విఘాతం కలిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని, పలు కంపెనీలు సర్కారుపై కేసులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ కథనం ప్రచురితమైంది.

ఇక దీన్నే ప్రస్తావించిన చంద్రబాబు, "ఇప్పుడు చాలా ఎంబరాసింగ్ గా ఉంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు. విదేశీ కంపెనీలు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్థిక వ్యవహారాల శాఖను బెదిరిస్తున్నాయి. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇండియాకూ ప్రమాదమే" అని వ్యాఖ్యానించారు.

More Telugu News