అదే సెంటిమెంటును ఫాలో అవుతున్న మెగా హీరో

Wed, Nov 20, 2019, 10:14 AM
  • 'చిత్రలహరి'తో హిట్ కొట్టిన తేజు 
  • 'ప్రతిరోజూ పండగే'తో ప్రేక్షకుల ముందుకు 
  • కంటిన్యూ చేస్తున్న సెంటిమెంట్
ఆ మధ్య సాయిధరమ్ తేజ్ వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఒకానొక దశలో ఆయన పనైపోయిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపించింది. ఆ సమయంలోనే ఆయన పేరును సాయితేజ్ అని మార్చుకుంటే కలిసొస్తుందని ఎవరో చెప్పారట. దాంతో 'చిత్రలహరి' సినిమాకి ఆయన తన పేరును అలాగే వేసుకున్నాడు. ఆ సినిమా బాగానే ఆడటంతో ఆయనలో ఆ సెంటిమెంట్ బలపడింది.

తాజాగా ఆయన చేస్తున్న 'ప్రతిరోజూ పండగే' సినిమాకి కూడా టైటిల్స్ లో తన పేరును సాయితేజ్ అనే వేసుకుంటున్నాడట. అంతేకాదు ఆ తరువాత సినిమాగా రూపొందుతున్న 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాలోనూ ఆయన పేరు సాయితేజ్ అనే వుంటుందట. ఇక సాయిధరమ్ తేజ్ లో 'ధరమ్' ను ఆయన పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనని చెప్పుకుంటున్నారు. ఈ సెంటిమెంట్ ఎంతవరకూ కంటిన్యూ అవుతుందో చూడాలి మరి.
Tags: Sai Tej
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement