India: ఒకే ఒక్క ఇంజక్షన్‌తో ఇక 13 ఏళ్లపాటు నో సంతానం.. అభివృద్ధి చేస్తున్న భారత శాస్త్రవేత్త

  • సంతాన నిరోధానికి భారత వైద్యుల అద్భుత ఔషధం
  • అందుబాటులోకి వస్తే రికార్డు
  • ఇటువంటి ఇంజక్షన్ తయారీకి ప్రయత్నించి విఫలమైన అమెరికా

ఒక్క ఇంజక్షన్‌తో 13 ఏళ్లపాటు సంతానోత్పత్తిని దూరం చేసే ఔషధాన్ని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ఎస్ శర్మ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేస్తోంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే పురుషులు ఇక వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, ప్రపంచంలోనే తొలి సంతాన నిరోధక ఇంజక్షన్‌గానూ ఇది రికార్డులకెక్కుతుంది. అభివృద్ధి దశలో ఉన్న ఈ ఇంజక్షన్‌‌కు ‘రివర్సిబుల్‌ ఇన్‌హిబిషన్‌ ఆఫ్‌ స్పెర్మ్‌ అండర్‌ గైడెన్స్‌’ (ఆర్‌ఐఎస్‌యూజీ) అని పేరుపెట్టారు.

303 మందిపై మూడు విడతల్లో జరిపిన పరీక్షల్లో 97.3 శాతం సానుకూల ఫలితాలు వచ్చినట్టు పరిశోధన బృందం తెలిపింది. ఆర్‌ఐఎస్‌యూజీకి  భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం లభించేందుకు ఏడు నెలలు పట్టే అవకాశం ఉందని సమాచారం. 2016లో అమెరికా కూడా ఇటువంటి ఇంజక్షన్ అభివృద్ధికి ప్రయత్నించిన విజయం సాధించలేకపోయింది. ఆ ఇంజక్షన్ వికటించి పురుషుల మొహంపై మొటిమలు రావడం, శరీరంపై మచ్చలు రావడంతో ఆ ప్రయోగం పక్కన పడింది.

More Telugu News