ప్రియుడి అవసరాలు తీర్చేందుకు అక్క ఇంటికే కన్నం!
- బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
- నిందితుల నుంచి నాలుగు తులాల బంగారం రికవరీ
- ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
దీంతో ఆమె, ఫీర్జాదిగూడ బుద్ధానగర్ లో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లి, ఆమె ఇంట్లో లేని సమయంలో బంగారు నగలు దొంగిలించింది. వాటిని రాహుల్ కు ఇవ్వగా, నిఖిల్ అనే తన స్నేహితుడితో కలిసి వాటిని అమ్మేశాడు. ఇంట్లోని బంగారం పోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఝాన్సీని అనుమానించి, గట్టిగా ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించింది. రాహుల్, నిఖిల్, ఝాన్సీలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, నాలుగు తులాల బంగారు నగలు రికవరీ చేశామని పోలీసులు తెలిపారు.